Dunki Collections : ఎట్టకేలకు కలెక్షన్స్ అనౌన్స్ చేసిన డంకీ.. ఐదు రోజులు ఎంత కలెక్షన్స్ అంటే..

షారుఖ్ ఖాన్ డంకీ కలెక్షన్స్ ని ఎట్టకేలకు అనౌన్స్ చేశారు. ఐదు రోజులు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..

Shah Rukh Khan recent movie Dunki Collections in five days

Dunki Collections : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజైన సంగతి తెలిసిందే. పఠాన్, జవాన్ మాదిరి కాకుండా ఈ సినిమాని కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేశారు. తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

కాగా ఈ మూవీ రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నా మూవీ టీం మాత్రం కలెక్షన్స్ విషయం తెలియజేయడం లేదు. మరో పక్క ఈ చిత్రంతో పాటు రిలీజ్ అయిన సలార్.. ప్రతిరోజు కలెక్షన్స్ తెలియజేస్తూ వస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా డంకీ కలెక్షన్స్ తెలియజేయాలంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా మూవీ టీం.. సినిమా కలెక్షన్స్ ని అనౌన్స్ చేసింది.

Also read : Vishal : న్యూయార్క్ సిటీలో ఎవరో అమ్మాయితో విశాల్ వీడియో వైరల్.. మొహం దాచుకున్న హీరో..!

ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.256.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలియజేశారు. షారుఖ్ గత చిత్రాలు పఠాన్, జవాన్ కలెక్షన్స్ తో పోలిస్తే.. ఈ కలెక్షన్స్ చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ఈ చిత్రం కేవలం హిందీలోనే రిలీజ్ కావడం కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించి అనే చెప్పాలి. మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రం 220 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు చెబుతున్నారు.

దీనిబట్టి చూస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. షేర్ కలెక్షన్స్ ని 225 కోట్ల వరకు నమోదు చేయాలి. మరి డంకీ ఆ కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక షారుఖ్ గత రెండు చిత్రాలు పఠాన్, జవాన్ మాదిరి ఇది 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం అనేది జరగడం కష్టం.