Shah Rukh Khan Says Will Watch Pathaan If Ram Charan Takes Him
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘పఠాన్’ మనముందుకు రాబోతుంది. ఈ సినిమాలో షారుఖ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Shah Rukh Khan : మీరు ఆస్కార్‌ని తెచ్చినప్పుడు నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి.. చరణ్‌కి షారుఖ్ ట్వీట్!
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను అదిరిపోయే రేంజ్‌లో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా షారుఖ్ తన అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించాడు. పఠాన్ సినిమాను అభిమానులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఓ అభిమాని తెలుగులో పఠాన్ సినిమాను ఏదైనా థియేటర్‌లో వీక్షిస్తారా అని ప్రశ్నించగా.. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనను తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూస్తానంటూ చెప్పుకొచ్చాడు.
చరణ్‌తో షారుక్‌కి మంచి బంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో, తమ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే.. తనను ఒకసారి తాకనివ్వాలంటూ షారక్ చరణ్‌కు ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు పఠాన్ సినిమా గురించి కూడా చరణ్ ప్రస్తావన తీసుకురావడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అయ్యింది. ఇక పఠాన్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, జాన్ అబ్రహాం విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023