Shahrukh Khan – Vicky Kaushal : రేయ్.. ఇదేం డ్యాన్స్ రా బాబు.. ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకు షారుఖ్, విక్కీ కౌశల్ స్టెప్పులు..

తాజాగా ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ కి ఐఫా వేదికపై బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ డ్యాన్స్ వేశారు.

Shah Rukh Khan Vicky Kaushal Dance for Pushpa Samantha Song in IIFA 2024 Event

Shahrukh Khan – Vicky Kaushal : పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా.. ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. మన తెలుగులోనే కాక ఇండియాని దాటి కూడా వరల్డ్ వైడ్ బాగా పాపులర్ అయింది ఆ పాట. సోషల్ మీడియాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ తో కొన్ని కోట్ల మంది రీల్స్ చేసారు. సమంత, అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కి అంతా ఫిదా అయిపోయారు.

తాజాగా ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ కి ఐఫా వేదికపై బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ డ్యాన్స్ వేశారు. అబుదాబిలో ఐఫా వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసింది. నిన్న బాలీవుడ్ కి సంబంధించిన అవార్డు వేడుకలు జరగడంతో అనేకమంది బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో షారుఖ్, విక్కీ కౌశల్ స్టేజిపై కాసేపు సందడి చేసారు. దీంట్లో భాగంగా ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ కి ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. దీంతో వీరి డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Prabhas – Arshad Warsi : ప్రభాస్‌ని జోకర్ అన్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తాజా కామెంట్స్.. నేను ప్రభాస్‌ని అనలేదు..

అయితే ఇవి సమంత, అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ లానే ఉన్నా ఇద్దరు హీరోలు ఇలా చేస్తుంటే మాత్రం ఫ్యాన్స్ తమ హీరోలు అలా స్టేజిపై స్టేజిపై డ్యాన్స్ వేసి రచ్చ చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం స్టేజి మీద ఆ స్టెప్పులేంట్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా షారుఖ్, విక్కీ కౌశల్ డ్యాన్స్ వీడియో చూసేయండి..