Shah Rukh Khan, Aryan Khan Bail Petition, Mumbai City Court, Drug Case
Aryan Khan Bail Petition : డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై సిటీకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మరో మూడు రోజుల పాటు ( Narcotic Control Bureau) NCB కస్టడీని పొడిగించింది. మరింత లోతుగా విచారణ జరపాలన్న NCB అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
అక్టోబర్ 7వరకూ కస్టడీని పొడిగించింది. డ్రగ్స్ కేసులో ముంబై సిటీకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్యన్‌ను 11వ తేదీ వరకూ తమ కస్టడీకి ఇవ్వాలని NCB కోరింది. డ్రగ్స్ దొరకనందున బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు విచారణకు షారుఖ్ భార్య గౌరీఖాన్ కూడా హాజరయ్యారు. ఆర్యన్ తరపున సీనియర్ లాయర్ సతీశ్ మనీష్‌షిండే వాదనలు వినిపించారు. ఎన్సీబీ తరపున అనిల్‌సింగ్ హాజరయ్యారు.
Aryan Khan : డ్రగ్స్ కేసు.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు
సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నందున ఆర్యన్‌ఖాన్ (Aryan Khan)ను కస్టడీకి ఇవ్వాల్సిందేనని NCB వాదించింది. ఆర్యన్ వాట్సప్ చాట్‌లో కీలక అంశాలున్నాయని వాటి ఆధారంగా విచారణ జరగాల్సి ఉందని పేర్కొంది. ఆర్యన్ విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా డ్రగ్స్ సప్లయర్స్‌పై దాడులు చేసింది. భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా NCB కోర్టుకు తెలిపింది అరెస్టైన వారంతా విద్యార్థులేనని, ఫ్యాషన్ కోసం డ్రగ్స్ తీసుకుంటున్నారని వివరించింది.
వీరిని వదిలేస్తే దాని ప్రభావం ఇతరులపై పడుతుందని వాదనలు వినిపించింది. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని విచారించకపోతే వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. డ్రగ్స్ పెడలర్స్‌తో సంబంధాలున్న వ్యక్తులు అమాయకులు కాదని ఎన్సీబీ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
అసలు ఆర్యన్‌ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు లాయర్ సతీశ్ వాదించారు. డ్రగ్స్ కొనుగోలు, సరఫరాతో ఆర్యన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాట్సప్ చాట్‌లో ఎక్కడా డ్రగ్స్ ప్రస్తావన లేదన్నారు. ఒకవేళ ఆ ప్రస్తావన ఉన్నా… ఎలాంటి డ్రగ్స్ దొరకనప్పుడు ఆ చాట్స్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఆర్యన్‌ను గెస్ట్‌గా పిలిచారని.. తన దగ్గర బోర్డింగ్‌పాస్ కానీ, టికెట్‌కానీ లేవని చెప్పారు. గెస్ట్ కావడంతో సూట్ ఇచ్చారని ఎన్సీబీ అధికారులు అక్కడే అరెస్ట్ చేశారని సతీశ్ వాదించారు.. అయితే కోర్టు మాత్రం ఆర్యన్ ఖాన్ కస్టడీని పొడిగించింది.
Auto Driver : ఆటో డ్రైవర్ ని ప్రేమించి.. ప్రాణం తీసింది