Jersey Movie : పక్కా హిట్.. ఎమోషనల్‌గా ‘జెర్సీ’ ట్రైలర్..

టాలీవుడ్ ‘జెర్సీ’ తో బాలీవుడ్‌లో మరో హిట్ కొట్టబోతున్నాడు షాహిద్ కపూర్..

Jersey Movie Trailer

Jersey Movie: ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీని అదే పేరుతో అల్లు అరవింద్ సమర్పణలో.. నాగవంశీ – దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు..

Ajay Devgn : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

బన్నీవాసు సహ నిర్మాత. మృణాళిని ఠాకూర్ కథానాయికగా నటించగా.. తెలుగు ‘జెర్సీ’ డైరెక్ట్ చేసి వివర్శకుల ప్రశంసలందుకున్న గౌతమ్ తిన్ననూరి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆమీర్ ఖాన్‌తో హిందీలో ‘గజిని’ రూపొందించిన తర్వాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా ఇదే.

Jayasudha : జయసుధకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

మంగళవారం ‘జెర్సీ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘కబీర్ సింగ్’ లాంటి సీరియస్ క్యారెక్టర్ తర్వాత రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్‌లో షాహిద్ మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకోనున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

కథలోని ఎమోషన్స్ క్యారీ అయ్యే విధంగా చాలా వరకు ఒరిజినల్ వెర్షన్‌నే ఫాలో అయినట్లు తెలుస్తుంది. అనిల్ మెహ్తా విజువల్స్, సాచేత్ – పరంపరల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. టాలీవుడ్ ఎడిటర్ నవీన్ నూలి కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌లో వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 31న ‘జెర్సీ’ గ్రాండ్‌గా విడుదల కానుంది.