Shahrukh – Deepika : స్టేజిపై దీపికా – షారుఖ్ అదిరిపోయే డ్యాన్స్.. జవాన్ సాంగ్ కి స్టెప్పులు..

జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో అనిరుద్ వచ్చి సాంగ్స్ కూడా పర్ఫార్మ్ చేయగా షారుఖ్ ఖాన్ కూడా స్టేజి మీదకు వచ్చి స్టెప్పులు వేశాడు.

Shahrukh Khan Deepika Padukone Dance for Jawan Movie song in Jawan Success Meet videos goes viral

Shahrukh – Deepika :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో షారుఖ్ ఫుల్ యాక్టివ్ గా కనపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు. అందరితో ఫోటోలు దిగారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో అనిరుద్ వచ్చి సాంగ్స్ కూడా పర్ఫార్మ్ చేయగా షారుఖ్ ఖాన్ కూడా స్టేజి మీదకు వచ్చి స్టెప్పులు వేశాడు. షారుఖ్ స్టేజి మీదకు వస్తూనే దీపికా పదుకొనేని కూడా స్టేజిపై తీసుకొచ్చి ఇద్దరూ కలిసి జవాన్ సినిమాలో బాగా హిట్ అయినా లవ్ సాంగ్ ఛలేయాకి స్టెప్పులు వేశారు.

దీంతో షారుఖ్ – దీపికా కలిసి స్టేజిపై స్టెప్పులేసి వీడియో వైరల్ గా మారింది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ పఠాన్, జవాన్ సక్సెస్ లతో షారుఖ్ డల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. అభిమానులు కూడా వరుస విజయాలు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Shahrukh Khan : జవాన్ సినిమాకి సౌత్ వాళ్ళే ఎక్కువగా పనిచేశారు.. ఈ విజయం వాళ్లదే.. షారుఖ్ కామెంట్స్..

ఇక జవాన్ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే, సాన్యా మల్హోత్రా.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.