Shahrukh Khan : షూటింగ్‌లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

ఇటీవల అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఓ సినిమా షూట్ కోసం వెళ్లగా అక్కడ షూటింగ్ లో షారుఖ్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

Shahrukh Khan injured in movie shooting don a surgery at America

Shahrukh Khan :  బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ సినిమాతో వచ్చి చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టాడు. అదే ఫామ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ జవాన్, డుంకి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఓ సినిమా షూట్ కోసం వెళ్లగా అక్కడ షూటింగ్ లో షారుఖ్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

డుంకి షూటింగ్ లోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. షారుఖ్ షూటింగ్ లో గాయపడగా వెంటనే హాస్పిటల్ కి తరలించారు చిత్రయూనిట్. అక్కడే అమెరికాలో షారుఖ్ కి చిన్నపాటి సర్జరీ కూడా అయినట్టు సమాచారం. సర్జరీ అనంతరం తాజాగా షారుఖ్ ఇండియాకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షారుఖ్ రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడని, కొన్ని రోజులు రెస్ట్ మోడ్ లోనే ఉంటాడని బాలీవుడ్ సమాచారం.

Mangalavaaram : ‘మంగళవారం’ టీజర్ రిలీజ్.. ఈ సారి పాయల్‌తో కలిసి భయపెట్టడానికి రెడీ అయిన RX 100 డైరెక్టర్..

అయితే షారూఖ్ ఖాన్ కి ప్రమాదం జరిగింది, సర్జరీ జరిగిందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా షారుఖ్ కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.