Jawan Collections : జవాన్ కలెక్షన్స్.. 100 కోట్లు దాటి.. మరోసారి బాలీవుడ్ బాద్ షా సత్తా..

ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని బాక్సాఫీస్ సమాచారం.

Shahrukh Khan Jawan Movie first day Collections crosses 100 crores

Jawan Collections :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చాడు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.

ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తాయని అంచనా వేశారు. ఇటీవలే షారుఖ్ పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జవాన్ తో కూడా కలెక్ట్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మనకు సౌత్ వాళ్లకి పాత కథే అయినా నార్త్ వాళ్లకి చాలా కొత్తగా ఉండటంతో సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు. మనకి తెలిసిన కథలో షారుఖ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు అట్లీ. షారుఖ్ జవాన్ సినిమా మొదటి రోజు ఇండియాలో దాదాపు 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఓవర్సీస్ లో ఇంకో 30 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని బాక్సాఫీస్ సమాచారం. బాక్సాఫీస్ ట్రేడర్లు ప్రకటించినా చిత్రయూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Mahesh Babu : జవాన్ సినిమాపై మహేష్ బాబు రివ్యూ చూశారా.. మహేష్ కి ఎంతగా నచ్చిందంటే..

దీంతో జవాన్ సినిమాతో మరోసారి మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సత్తా చాటాడు బాలీవుడ్ బాద్ షా. ఇటీవల పఠాన్ సినిమా కుడా మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసింది. జవాన్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.