Shahrukh Khan Pathaan Movie coming soon in Amazon Prime OTT
Pathaan : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో 1030 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న బాలీవుడ్ కి కూడా హిట్ సినిమా ఇచ్చాడు షారుఖ్. ఈ సినిమా విజయంతో బాలీవుడ్ అంతా సంతోషించింది.
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమా అవ్వడం, భారీ హిట్ కొట్టడంతో పఠాన్ సినిమా 50 రోజుల వరకు ఆగింది. ఇప్పుడు పఠాన్ సినిమా మరో వారం రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. పఠాన్ సినిమా మార్చ్ 22 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వబోతున్నట్టు సమాచారం.
Alia Bhatt : అలియాభట్ 30వ బర్త్‌డే కేక్ చూశారా?
పఠాన్ సినిమా తమ ఓటీటీలో రాబోతున్నట్టు అమెజాన్ ప్రకటించినా డేట్ మాత్రం అధికారికంగా చెప్పలేదు. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం మార్చ్ 22 నుంచి పఠాన్ సినిమా అమెజాన్ ఓటీటీలోకి రానుంది. దీంతో షారుఖ్ అభిమానులు మరోసారి పఠాన్ ని చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో కోట్లు కొల్లగొట్టిన పఠాన్ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి.
3 x action, 3 x thrill, 3 x excitement pic.twitter.com/ivICx4wchp
— prime video IN (@PrimeVideoIN) March 14, 2023