Shahrukh Khan: షారుఖ్ ఖాన్ స్కాలర్‌షిప్‌.. వీళ్లకోసమే..ఏకంగా ఆస్ట్రేలియాలో చదవచ్చు!

బాలీవుడ్ హీరో షారుఖ్‌ ఖాన్‌ తన పఠాన్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేని షారుఖ్ ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. షారుఖ్ ఖాన్‌ సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోనే అనిపించుకుంటున్నారు. విదేశాల్లో చదవాలి అనుకుని.........

Shahrukh Khan takes a Great step for India Students..who want to study in Australia

Shahrukh Khan: బాలీవుడ్ హీరో షారుఖ్‌ ఖాన్‌ తన పఠాన్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేని షారుఖ్ ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా దీపికా పదుకొణె కథనాయకిగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

Sharukh Khan : హిట్ కోసం పాకులాడుతున్న బాద్‌షా .. హిట్ డైరెక్టర్స్‌తో సినిమాలు..

షారుఖ్ ఖాన్‌ సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోనే అనిపించుకుంటున్నారు. విదేశాల్లో చదవాలి అనుకుని సరైన ఆర్థిక స్థోమత లేని విద్యార్థినిలకు షారుఖ్ సహాయం అందిస్తున్నాడు. ఆస్ట్రేలియా ‘లా ట్రోబ్ యూనివర్సిటీ’లో PhD చేయాలి అనుకునే విద్యార్థుల కోసం హీరో షారుఖ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IIFM) మరియు లా ట్రోబ్ యూనివర్శిటీతో చేతులు కలిపి స్కాలర్‌షిప్‌ను ప్రారంభించాడు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక లా ట్రోబ్ యూనివర్సిటీ వెబ్‌సైట్ – latrobe.edu.auలో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 23 వరకు సమయం ఉంది.

Sharukh Khan : కొడుక్కి బెయిల్.. లీగల్ టీంకి పార్టీ ఇచ్చిన షారుఖ్

అయితే ఈ స్కాలర్‌షిప్ కోసమై అభ్యర్థులు కచ్చితంగా భారతదేశంలో నివసిస్తున్న మహిళా భారతీయులై ఉండాలి మరియు గత 10 సంవత్సరాలలో తమ మాస్టర్స్ ఆఫ్ రీసెర్చ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన విద్యార్థి నాలుగు సంవత్సరాల లా ట్రోబ్ యూనివర్శిటీ పూర్తి ఫీజు ($225,000 AUD) రీసెర్చ్ స్కాలర్‌షిప్‌ను అందుకుంటారు. విదేశాల్లో చదవాలి అనుకుంటున్న మహిళా విద్యార్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.