Shahrukh Khan : వరుసగా మూడోసారి.. సినిమా రిలీజ్‌కి ముందు వైష్ణోదేవి ఆలయానికి షారుఖ్.. సినిమా హిట్ కోసమే..?

ఇవాళ ఉదయం షారుఖ్, తన మేనేజర్, బాడీ గార్డ్స్ తో కలిసి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Shahrukh Khan Visited Vaishno Devi Temple in Jammu before Dunki Movie Release

Shahrukh Khan : షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఈ సంవత్సరం జనవరిలో పఠాన్ సినిమాతో, ఆ తర్వాత జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాలు సాధించి రెండు సినిమాలకు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ సినిమాలతో పరాజయాల్లో ఉన్న బాలీవుడ్ కి కూడా ఊపు తీసుకొచ్చారు షారుఖ్.

త్వరలో ‘డంకీ’ సినిమాతో రాబోతున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు షారుఖ్. తాజాగా షారుఖ్ జమ్మూలోనే వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ ఉదయం షారుఖ్, తన మేనేజర్, బాడీ గార్డ్స్ తో కలిసి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అయితే షారుఖ్ గత రెండు సినిమాల రిలీజ్ కి ముందు కూడా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం విశేషం. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు కూడా గత సంవత్సరం ఇదే డేట్ డిసెంబర్ 12న వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆగస్టులో జవాన్ సినిమా రిలీజ్ కి ముందు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు డంకీ కూడా పెద్ద హిట్ అవ్వాలని మళ్ళీ ఈ ఆలయానికి వచ్చినట్టు సమాచారం.

Also Read : Trisha Krishnan : ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో త్రిష రీఎంట్రీ ఇవ్వబోతుందా? ఆ సీనియర్ హీరోల సినిమాల్లో?

షారుఖ్ స్వతహాగా ముస్లిం అయినా హిందూ పండగలు సెలబ్రేట్ చేసుకుంటాడు, హిందూ దేవుళ్ళకు కూడా మొక్కుతాడు, పలు ఆలయాలకు వెళ్లి దర్శనం కూడా చేసుకుంటాడు. జవాన్ రిలీజ్ కి ముందు మన తిరుమలకు కూడా వచ్చి దర్శనం చేసుకున్నాడు షారుఖ్. అయితే వైష్ణో దేవి ఆలయానికి వరుసగా సినిమా రిలీజ్ ల ముందు మూడో సారీ వెళ్లడంతో సినిమా హిట్ అవ్వాలని, అందుకోసమే పూజలు చేయడానికి వెళ్లాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక షారుఖ్ అభిమానులు డంకీ సినిమా నాకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.