Trisha Krishnan : ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో త్రిష రీఎంట్రీ ఇవ్వబోతుందా? ఆ సీనియర్ హీరోల సినిమాల్లో?
తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళ్ సినిమాలతోనే డబ్బింగ్ వర్షన్ లో ఇక్కడి ప్రేక్షకులని పలకరించింది త్రిష.

Trisha will Re Entry in Telugu Movies after Eight Years Rumours goes Viral
Trisha Krishnan : త్రిష.. ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అభిమానులని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష. చివరిసారిగా 2016లో నాయకి అనే డైరెక్ట్ సినిమా చేసింది. ఆ తర్వాత నుంచి తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళ్ సినిమాలతోనే డబ్బింగ్ వర్షన్ లో ఇక్కడి ప్రేక్షకులని పలకరించింది త్రిష. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా తన అందంతో ప్రేక్షకులని, అభిమానులని ఫిదా చేస్తుంది.
ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష అడపాదడపా సినిమాలు చేస్తూ ఇటీవల మళ్ళీ ఫుల్ బిజీ అవుతుంది. పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు అజిత్ సరసన ఓ సినిమాలో నటించబోతుంది. సీనియర్ హీరోల సరసన త్రిష ఇప్పుడు బెస్ట్ ఛాయస్ అవుతుంది మళ్ళీ. దీంతో తెలుగులో కూడా త్రిషని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న మెగా 156 సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి, త్రిష కలిసి ఆల్రెడీ స్టాలిన్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ జంట మరోసారి కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మెగా 156 సినిమా ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ అని, విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Also Read : Kantara 2 Movie : కాంతార 2 సినిమాలో నటిద్దామనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..
అలాగే నాగార్జున(Nagarjuna) చేయబోయే సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా అనుకుంటున్నారు. తమిళ్ నిర్మాణ సంస్థలో ‘లవ్ యాక్షన్ రొమాన్స్’ అనే సినిమా నాగార్జునతో తీయబోతున్నారు. ఈ సినిమాలో కూడా త్రిషని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో నాగార్జున, త్రిష కలిసి కింగ్ సినిమాలో నటించారు. త్రిష తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వచ్చే వార్తలు నిజమయితే కచ్చితంగా తెలుగులో త్రిష మళ్ళీ బిజీ అవుతుంది, సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.