Kantara 2 Movie : కాంతార 2 సినిమాలో నటిద్దామనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..
కాంతార సినిమాకి ప్రీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

Do you Wanna Act in Kantara 2 Movie Full Details Here
Kantara 2 Movie : కన్నడలో రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరోగా సప్తమి గౌడ(Sapthami Gowda) హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన కాంతార సినిమా చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార(Kantara) సినిమా దాదాపు 450 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక కాంతార సినిమాకి ప్రీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. కాంతార ప్రీక్వెల్ దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి కొత్త నటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు చిత్రయూనిట్. ఇందుకు ఆడిషన్స్ పెట్టి చాలా మందికి అవకాశం ఇవ్వబోతున్నారు.
తాజాగా కాంతార ప్రీక్వెల్ సినిమాకి ఆడిషన్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం 30 నుంచి 60 ఏళ్ళు ఉన్న మగవారు, 18 నుంచి 60 ఏళ్ళు ఉన్న ఆడవారు కావాలి. సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు https://www.kantara.film అనే సైట్ లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని తెలిపారు. అలాగే రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసే వాళ్ళు అవి అప్లోడ్ చేయకండి అని చెప్పడం గమనార్హం. దీంతో ఈ సినిమాలో నటించడానికి నూతన నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా నటిద్దామనుకుంటే సైట్ లోకి వెళ్లి అప్లై చేసేయండి.
View this post on Instagram