Venkatesh Maha : నెటిజన్ పై ఫైర్ అయిన డైరెక్టర్.. లీగల్ గా ఫైట్ చేస్తా.. మరోసారి కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ పై విమర్శలు..

వెంకటేష్ మహా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో KGF సినిమాని బాగా విమర్శించి వివాదంలో నిలిచాడు.

Venkatesh Maha : నెటిజన్ పై ఫైర్ అయిన డైరెక్టర్.. లీగల్ గా ఫైట్ చేస్తా.. మరోసారి కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ పై విమర్శలు..

Director Venkatesh Maha counter to Netizen Social Media Reacts

Updated On : December 12, 2023 / 10:43 AM IST

Venkatesh Maha : కేరఫా కంచరపాలెం(C/o Kancherapalem) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు వెంకటేష్ మహా. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే ఓ రీమేక్ సినిమా చేశారు. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు వెంకటేష్ మహా. అయితే కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో KGF సినిమాని బాగా విమర్శించి వివాదంలో నిలిచాడు.

KGF సినిమాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంతో ఆ సినిమా అభిమానులు, నెటిజన్లు ఈ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు. అయితే డైరెక్టర్ ఆ తర్వాత సారీ చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనని అన్నాడు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో తీసిన ఒక్క సినిమాకే ఇంకో సినిమాని తిట్టేంతగా మాట్లాడుతున్నాడు అంటూ ఎప్పుడు దొరికితే అప్పుడు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ వెంకటేష్ మహా పెట్టిన ఓ ట్వీట్ కి.. ఈయన తీసింది ఒక్క సినిమానే. పైగా KGF బాగోలేదు అని రివ్యూ ఇస్తాడు, ఈయన హీరో అంట, కామెడీ ఫెలో అంటూ విమర్శలు చేయడంతో వెంకటేష్ మహా సీరియస్ అయి నెటిజన్ కి కౌంటర్ ఇచ్చాడు.

వెంకటేష్ మహా ఆ నెటిజన్ కి రిప్లై ఇస్తూ.. వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి, ఎన్ని సినిమాలు తీశామన్నది ముఖ్యం కాదు ఏం సినిమా తీసాము అనేది ముఖ్యం. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను తెలుగులో కొన్ని మంచి సినిమాలు తీశానని, ఇంకా మంచి సినిమాలు తీస్తాను. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంక ఊరుకోను. కావాలంటే దీనిపై పర్సనల్ గా, లీగల్ గా కూడా ఫైట్ చేస్తాను. మీరు ఇకనైనా సైలెంట్ గా ఉంటే మంచిది అంటూ తనపై విమర్శలు చేసే వారందరికీ ఒకేసారి కౌంటర్ ఇచ్చాడు.

Also Read : Rajinikanth : సూపర్ స్టార్ బర్త్‌డే.. 73 ఏళ్ళ వయసులో కూడా అభిమానుల కోసం కష్టపడుతున్న రజినీకాంత్..

అయితే దీనిపై నెటిజన్లు మరోసారి విమర్శలు చేస్తున్నారు. నువ్వు మాత్రం వేరే సినిమాని, డైరెక్టర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, నానా మాటలు అనొచ్చు. మేము మాత్రం అంటే తీసుకోలేవా? సెలబ్రిటీల మీద ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, వాటిని పట్టించుకుంటూ కూర్చుంటావా? అని విమర్శలు చేస్తున్నారు. ఇక కొంతమంది వెంకటేష్ మహాకి సపోర్ట్ చేస్తూ ఇలాంటివి పట్టించుకోకు, ఇంకో సినిమా తీసి వీళ్ళ నోళ్లు మూయించు అని కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ ఇష్యూ మీద వరుసగా కొంతమంది కామెంట్స్ కి కౌంటర్లు ఇవ్వడం గమనార్హం. మొత్తానికి వెంకటేష్ మహా మరోసారి వైరల్ అవుతున్నాడు. మరి త్వరలో ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.