Guppedantha Manasu : బెడిసికొట్టిన శైలేంద్ర ప్లాన్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రిషి

కాలేజీకి వచ్చిన పాత లెక్చరర్లు తమని కాదని కొత్త వారిని ఎలా తీసుకున్నారని వసుధరని ప్రశ్నిస్తారు. వారి మాటలు విన్న రిషి ఏం చెప్తాడు? 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu

Guppedantha Manasu : వసుధర, రిషి కాలేజ్‌కి వెళ్తారు. రిషి క్లాసులు చెప్పడం మొదలుపెడతాడు. వసుధర దగ్గరకి పాత లెక్చరర్లు వచ్చి కొత్త వాళ్లని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తారు. యూనియన్‌లో కంప్లైంట్ చేస్తామని బెదిరిస్తారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu : హనీమూన్‌లో మరింత దగ్గరైన రిషి, వసుధర.. వాళ్లెక్కడ ఉన్నారో శైలేంద్రకు తెలిసిపోయిందా?

రిషి, వసుధర కాలేజ్‌కి వెళ్లగానే జీతాలు పెంచకపోతే ఉద్యోగాలు మానేస్తామని వెళ్లిపోయిన పాత ఉద్యోగులు కాలేజీకి వస్తారు. తమను తీసి కొత్త వాళ్లను ఎలా పెట్టుకుంటారని వసుధరని ప్రశ్నిస్తారు. వెంటనే వాళ్లని తీసేయకపోతే కాలేజ్ ముందు స్ట్రైక్ చేస్తామని.. యూనియన్‌లో కంప్లైంట్ చేస్తామని బెదిరిస్తారు. వాళ్ల మాటలు విన్న రిషి అర్ధాంతరంగా పని వదిలిపెట్టి వెళ్లిపోయింది మీరు.. మీకిష్టమైన యూనియన్లో కంప్లైంట్ చేసుకోండి అని చెప్తాడు. ఇలా జరుగుతుందని తెలియక తప్పుగా ప్రవర్తించామని.. క్షమించమని రిషిని  అడుగుతారు. పని చేయాలనుకుంటే జీతాలు ఇప్పుడైతే పెంచమని రిషి ఖచ్చితంగా వారికి చెబుతాడు. రిషి చెప్పినట్లు వింటామని తిరిగి విధుల్లో జాయిన్ అవుతామని పాత ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

శైలేంద్ర చిందులు తొక్కుతూ తల్లి దేవయానికి ఫోన్ చేస్తాడు. రిషి రిటైర్డ్ ఉద్యోగుల్ని విధుల్లో పెట్టుకుని తను అనుకున్న పని చేశాడని అంటాడు. నన్ను తొందరపడొద్దని చెప్పి నువ్వెందుకు ఆవేశపడుతున్నావని శైలేంద్రతో అంటుంది దేవయాని. రిషి చాలా మంచివాడని అతడిని మంచితనంతో దెబ్బకొట్టాలని .. తనకి చెప్పకుండా ఎలాంటి ప్లాన్స్ వెయ్యవద్దని చెబుతుంది.

Guppedantha Manasu : హనీమూన్‌కి వెళ్లిన రిషి, వసుధర.. మహేంద్రను కలసిన కొత్త క్యారెక్టర్ ఎవరు?

మరోవైపు విష్ కాలేజీ ప్రిన్సిపల్ పాండ్యన్‌ను పిలిచి తమ కాలేజ్‌లో పనిచేసిన రిషి, వసుధరలు పెళ్లి చేసుకున్నారని వారిని పిలిచి పార్టీ ఇద్దామని ఏర్పాట్లు చేయమని చెబుతాడు. రిషికి ఫోన్ చేసి రిషి, వసుధరలను తమ కాలేజ్‌కి రమ్మని ఆహ్వానిస్తాడు. రిషి, వసుధరలు విష్ కాలేజ్‌కి వెళ్లడానికి రెడీ అవుతారు. తండ్రి మహేంద్రకి విష్ కాలేజ్‌కి వెళ్తున్నట్లు రిషి చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.