Mukesh Khanna : శక్తిమాన్ మళ్ళీ తిరిగొస్తున్నాడు.. లీకైన ముఖేష్ ఖన్నా వీడియో..

Shaktimaan is back again Leaked video of Mukesh Khanna

Mukesh Khanna : ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్ శక్తిమాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెద్దల నుండి చిన్న పిల్లల దాకా మిస్స్ అవ్వకుండా ఈ సీరియల్ చేసేవారు. ఇందులో ప్రముఖ నటుడు ముఖేష్ ఖాన్ శక్తిమాన్ గా నటించారు. తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శక్తిమాన్ లో నటించడంపై స్పందించారు. మళ్ళీ ఆయన ఇండియన్ స్క్రీన్ పై శక్తిమాన్ లాంటి క్యారెక్టర్ తో కనిపిస్తానని చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇండియాస్ ఓజి శక్తిమాన్ పాత్రను పోషించడం పై ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.

Also Read : Pujita Ponnada : హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. చేతికి సెలైన్ తో ఫొటో షేర్ చేసి..

ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..శక్తిమాన్ కాస్ట్యూమ్ నా లోపలి నుండి వచ్చింది. నా మనసుకి బాగా నచ్చింది. ఈ కాస్ట్యూమ్ నా మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యింది. యాక్టింగ్ అనేది పూర్తిగా నమ్మకం మాత్రమే. నేను ఒక్కసారి యాక్టింగ్ మొదలు పెడితే కెమెరాస్ ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోతాను. శక్తిమాన్ పాత్రలో నటిస్తున్నందుకు అందరికంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.1997 నుండి నా ఈ కర్తవ్యాన్ని స్టార్ట్ చేశా అన్నారు. అప్పటి నుండి 2005 వరకు అది సాఫీగా సాగింది. అదే ఇప్పుడు 2027 వరకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి జనరేషన్ అంత ఫాస్ట్ గా ఉందన్నారు.


తాజాగా ఆయన మళ్ళీ శక్తిమాన్ డ్రెస్ వేసుకొని, ఓ డైలాగ్ చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన షూటింగ్ జరుగుతుంది. అందుకే ఈ కాస్ట్యూమ్ లో కనిపించారు ముఖేష్ ఖాన్. అలాగే శక్తిమాన్ కి సంబందించిన టీజర్ సైతం విడుదల చేశారు. టీజర్ లో పై నుండి ఎగురుతూ వచ్చి ఓ స్కూల్ దగ్గర స్వతంత్రం గురించి పాట పాడాడు. మన మొదటి భారతీయ టీచర్ సూపర్ హీరో అంటూ టీజర్ ఉంది.