Pujita Ponnada : హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. చేతికి సెలైన్ తో ఫొటో షేర్ చేసి..

Heroine on the hospital bed shared a photo with saline in her hand
Pujita Ponnada : షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ప్రారంభించి తర్వాత పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది పూజిత పొన్నాడ. రామ్ చరణ్, సమంత కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాతో ఈ నటికి వరుస సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి, రన్, మిస్ ఇండియా, మనీషే,కథ కంచికి మనం ఇంటికి వంటి వరుస సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ ఫోటో షేర్ చేసింది. తన చేతి సెలైన్ పెట్టుకొని.. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఓ ఫోటో పెట్టింది. “ఈ సారి ఇండియా నన్ను ఇలా వెల్ కమ్ చేసిందని” ఆ పోస్ట్ లో పేర్కొంది. గత కొద్ది రోజులుగా ఈమె ఇంగ్లాండ్ లో ఉంది. ఇంగ్లాండ్ నుండి తిరిగి ఇండియా కి వస్తున్న నేపధ్యంలో ఈ ఫోటో షేర్ చేసింది.
Also Read : Khushi Kapoor : ఖుషి కపూర్ బ్రేస్ లెట్ పై ప్రియుడి పేరు.. ఆ రూమర్స్ నిజం చేసినట్టేనా..
పూజిత పొన్నాడ కి ఏం జరిగింది అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ నటి కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. నిరంతరం తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. మొత్తానికి ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.