Khushi Kapoor : ఖుషి కపూర్ బ్రేస్ లెట్ పై ప్రియుడి పేరు.. ఆ రూమర్స్ నిజం చేసినట్టేనా..

Khushi Kapoor boyfriend Vedang Raina name on her bracelet
Khushi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తల్లికి ఏ మాత్రం తగ్గని అందంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే ఖుషి కపూర్ గత కొంత కాలంగా వేదాంగ్ రైనాతో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి సరైన క్లారిటీ మాత్రం లేదు. ఇక ఇప్పుడు ఆ రూమర్స్ ను నిజం చేసింది ఖుషి. తన బ్రేస్ లెట్ పై వేదాంగ్ పేరులోని మొదటి అక్షరం వచ్చేలా డిజైన్ చేయించుకుంది. ఇటీవల ఈమె పుట్టిన రోజు సందర్బంగా ఓ బీచ్ లో దిగిన ఫోటోల్లో ఈ విషయం బయటపడింది.
Also Read : Pranav Mohanlal : తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..
ఇక తన పుట్టిన రోజు వేడుకలను బీచ్ లో జరుపుకున్న ఖుషి పలు ఫోటోలు దిగింది. వాటిలో వేదాంగ్ రైనా కూడా ఉన్నారు. ఈ ఒక్క ఫొటోతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న క్లారిటీ ఇచ్చింది ఖుషి. ఇక వీరిద్దరూ జంటగా ది ఆర్చీస్ అనే సిరీస్ లో నటించారు. అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. ఇప్పటికే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేదాంగ్ రైనా.. అలియా నటించిన జిగ్రా మూవీలోనూ కనిపించాడు. అలా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ నటుడిగా బిజీగా ఉన్నాడు.