Pranav Mohanlal : తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..

Pranav Mohanlal : తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..

Mohanlal son Pranav Mohanlal is working as a laborer in Spain

Updated On : November 12, 2024 / 12:59 PM IST

Pranav Mohanlal : మళయాళ సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్న స్టార్ మోహన్ లాల్ ఇంత వయస్సు వచ్చినప్పటికీ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన కొడుకు పేరు ప్రణవ్ మోహన్ లాల్. ఈ కుర్రాడు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. తర్వాత హీరోగా మారాడు.

హీరోగా పలు సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన స్పెయిన్ లో ఉన్నాడట. నిజానికి ఇలా స్టార్ డం ఉన్న హీరోస్ ట్రిప్స్ కి లేదా ఎంజాయ్ చెయ్యడానికి మాత్రమే వెళ్తారు. కానీ ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం స్పెయిన్ లో పని చెయ్యడాయికి వెళ్ళాడట. అక్కడ ఒక ఫామ్ లో ఈయన పని చేస్తున్నాడట. స్పెయిన్ లో గొర్రెలు కాయడం, గుర్రాలను చూసుకోవడం వంటి పనులు చేస్తున్నాడట.

Also Read : India’s Highest Paid Singers : ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ సింగర్స్.. ఎవరంటే..

అయితే ఈ పని చేస్తున్నందుకు అతడికి జీతం కూడా లేదట. ఈ పనికి గాను కేవలం భోజనం పెట్టి, ఆ ఫామ్ లోనే షెల్టర్ ఇస్తారని ప్రణవ్ తల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు ఇలాంటి కూలి పని చేసుకుంటూ బ్రతకడమే తనకి ఇష్టమని ఆమె తెలిపారు. అతడు చేస్తున్న ఈ పనిని తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమె తెలిపారు. దీన్ని బట్టి చూస్తే అందరూ హీరోల కొడుకులు ఒకేలా ఉండరని అర్ధమవుతుంది.