India’s Highest Paid Singers : ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ సింగర్స్.. ఎవరంటే..

India’s Highest Paid Singers : ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ సింగర్స్.. ఎవరంటే..

star singers who are getting the highest remuneration in India

Updated On : November 12, 2024 / 12:16 PM IST

India’s Highest Paid Singers : ఒక సినిమాకి యాక్షన్ సీన్స్ ఎంత ముఖ్యమో అందులో సాంగ్స్ కూడా అంతే ముఖ్యం. అలా సాంగ్స్ పాడే సింగర్స్ ఓ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట పాడడానికి వేలల్లో, అదే టాప్ సింగర్స్ అయితే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అలా ఇప్పటికే అన్ని సినీ ఇండస్ట్రీల్లో కలిపి టాప్ ప్లేస్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏ ఆర్ రెహమాన్. ఈయన ఒక్కో సినిమాకి దాదాపుగా 3 కోట్లకి పైగానే రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఆయన తర్వాత స్థానంలో ఉన్న స్టార్ సింగర్ శ్రేయ ఘోషాల్. ఈ సింగర్ దాదాపుగా ఒక్కో పాటకి 25 లక్షలు తీసుకుంటున్నారట. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పటికే చాలా భాషల్లో పాడి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక శ్రేయ ఘోషాల్ తర్వాత స్థానంలో సునిధి చౌహాన్ ఉన్నారు. ఈమె ఒక్కో పాటకి గాను 18 నుండి 20 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఈమె తరువాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సింగర్ అర్జిత్ సింగ్. ఈయన కూడా దాదాపుగా 20 లక్షల వరకు తీసుకుంటున్నారు. వీళ్ళ ఇద్దరికంటే తక్కువ సోను నిగమ్ తీసుకుంటున్నారు. ఈయన 18 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Also Read : Prateik Babbar : స్టార్ హీరో కొడుకు.. 13 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్..

అయితే అన్ని సినిమా ఇండస్ట్రీల్లో చాలా మంది స్టార్ సింగర్స్ ఉన్నారు. అయినప్పటికీ ఈ సింగర్స్ మాత్రం కేవలం ఒకే భాషలో కాకుండా పలు భాషల్లో సాంగ్స్ పాడి అందరికంటే టాప్ లో నిలిచారు. ఇటీవల జరిగిన కొన్ని సర్వేలల్లో వీళ్ళు మొదటి స్థానంలో ఉన్నటు ఆ సర్వేలు తెలిపాయి.