Prateik Babbar : స్టార్ హీరో కొడుకు.. 13 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్..

Prateik Babbar : స్టార్ హీరో కొడుకు.. 13 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్..

The star hero son Prateik Babbar was addicted to drugs at the age of 13

Updated On : November 12, 2024 / 11:32 AM IST

Prateik Babbar : లెజెండరీ నటి స్మితా పాటిల్, నటుడు రాజ్ బబ్బర్‌ల కుమారుడు  బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ చిన్న వయస్సు నుండే డ్రగ్స్ కి అలవాటు అవ్వడంపై స్పందించారు. తన కుటుంబం కారణంగా ఎలా డ్రగ్స్ అలవాటు అయ్యిందన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నటుడు ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి బాలీవుడ్ లో అనేకరకాల పుకార్లు వస్తున్నాయని వాటన్నిటికి సమాధానం చెప్తానని ఆ ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఇక ఆయన మాట్లాడుతూ..“చాలా సంవత్సరాలుగా, నేను దీని గురించి మాట్లాడుతున్నాను, కానీ ఈ విషయం ఆగడం లేదు. సినిమాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాడు, తర్వాత డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాడు అని అందరూ అనుకుంటారు. అది నిజం కాదు. నాకు పదమూడు, పన్నెండున్నర సంవత్సరాల వయస్సులో డ్రగ్స్ అలవాటు అయ్యింది. అది సినిమా ఇండస్ట్రీ వల్ల కాదు. నా కుటుంబ పరిస్థితులే దానికి కారణం. డ్రగ్స్ నన్ను నా కుటుంబాన్ని చాలా ప్రభావితం చేసింది. నాకు కాబోయే భార్య ఈ విషయంలో నన్ను మార్చడానికి చాలా సహాయం చేసింది. ఇప్పటికి  డ్రగ్స్ కథ ముగిసిందని క్లారిటీ ఇచ్చారు ప్రతీక్ బబ్బర్.

Also Read : Mandira : ‘మందిర’ గా భ‌య‌పెట్టేందుకు వ‌స్తున్న స‌న్నీ లియోన్‌..

ఇక ఈ నటుడు ధోబీ ఘాట్, దమ్ మారో దమ్, ఆరక్షన్, బాఘీ 2, ముల్క్, చిచోరే, ముంబై సాగా, ఇండియా లాక్‌డౌన్ వంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.