Shambhala movie OTT streaming update
Shambhala OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ చాలా ఏళ్ళ తరువాత హిట్ కొట్టాడు. ఆయనకు హిట్ అందించిన సినిమా శంబాల. సూపర్ నేచురల్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఓక రేంజ్ లో సర్ ప్రైజ్ చేసింది అనే చెప్పాలి. కథ రొటీన్ అయినా దానికి తెరకెక్కించిన తీరు చాలా కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ బాగా కనెప్ట్ అయ్యారు.
దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆది సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది.శంబాల(Shambhala OTT) ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే శంబాల మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేశారు.
డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను సరిగ్గా నెలరోజులకు అంటే జనవరి 22న స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ విడుదల చేశారు. దీంతో, ఓటీటీ ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. థియేటర్స్ లో చూడని వాళ్ళు, చూసినవాళ్లు కూడా మళ్ళీ చూసే అవకాశం ఉంది.
Shambhala movie OTT streaming update