Grammy Awards 2024 : గ్రామీ అవార్డుల్లో ఇండియన్స్ హవా.. ఏకంగా మూడు అవార్డులు గెలుచుకున్న జాకిర్ హుస్సేన్.. శంకర్ మహదేవన్ తో పాటు మరింతమంది..

ఈసారి గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్స్ హవా చూపించారు.

Shankar Mahadevan and Zakir Husaiian and some Indians Bags Grammy Awards 2024

Grammy Awards 2024 : ప్రపంచంలో సినిమాకు ఆస్కార్ అవార్డు ఎంతో, మ్యూజిక్ లో గ్రామీ అవార్డ్స్ కూడా అంతే. 66వ గ్రామీ అవార్డ్స్ లాస్ ఏంజిల్స్ లో మన టైం ప్రకారం ఇవాళ ఉదయం నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో ఆల్బమ్స్ పోటీపడ్డాయి. ఈసారి గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్స్ హవా చూపించారు.

శంకర్ మహదేవన్ తన బ్యాండ్ శక్తి నుంచి కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్ కు గ్రామీలో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుని శంకర్ మహదేవన్ తో పాటు అతని బ్యాండ్ మెంబర్స్ జాకిర్ హుస్సేన్, జాన్ లాగ్లిన్, సెల్వ గణేష్, గణేష్ రాజగోపాలన్ అందుకున్నారు.

Also Read : AR Rahaman : చనిపోయిన SP బాలు గారి వాయిస్ కావాలని అడుగుతున్నారు.. AR రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

దీంతో పాటు జాకిర్ హుస్సేన్ మరో గ్రామీ అవార్డుని కూడా అందుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో ‘పాస్తో’ ఆల్బమ్ కి బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేష్ చౌరాసియా, జాకిర్ హుస్సేన్ గ్రామీ అవార్డు అందుకున్నారు. ఇదే టీం బెస్ట్ కాంటెంపరరీ ఇంస్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరిలో ‘యాస్ వుయ్ స్పీక్’ ఆల్బమ్ తో మరో గ్రామీ అందుకున్నారు.

మొత్తంగా ఒకేసారి ఆరుగురు ఇండియన్స్ గ్రామీ అవార్డులు అందుకోవడం ఇదే మొదటిసారి. అందులోను జాకిర్ హుస్సేన్ ఒకేసారి మూడు అవార్డులు, రాకేష్ చౌరాసియా రెండు అవార్డులు అందుకోవడం విశేషం. గతంలో కూడా జాకిర్ హుస్సేన్ రెండు సార్లు గ్రామీ అవార్డు అందుకున్నారు.