Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించే సినిమాలు....
- Anil Aaleti
- Published On : June 29, 2022 / 03:05 PM IST
Sharwanand Clocks 1 Million Followers On Instagram
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలోనూ శర్వానంద్ యాక్టివ్‌గా ఉంటాడు. ఇతర హీరోల సినిమాలకు, వారి పుట్టినరోజులకు శర్వా బెస్ట్ విషెస్ చెబుతూ ఉంటాడు. అయితే తాజాగా శర్వా సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డును తన పేరిట వేసుకున్నాడు.
Sharwanand : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ రిలీజ్..
శర్వానంద్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడంతో ఆయన తన అభిమానులకు, ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇంతగా అభిమానిస్తూ, ప్రేమిస్తున్న అభిమానులకు తానెప్పటికీ రుణపడి ఉంటానని శర్వా అన్నారు. ఇక ఈ హీరో నటించిన లాస్ట్ మూవీ ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు తన కొత్త సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టాడు ఈ యంగ్ హీరో.
Sharwanandh: ఫ్యామిలీ స్టోరీనే నమ్ముకున్న శర్వా.. రియల్ హిట్ కొడతాడా?
ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో శర్వా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాతో పాటు రచయిత నుండి దర్శకుడిగా మారుతున్న కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో శర్వా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా శర్వానంద్ తన నెక్ట్స్ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టితీరాలని కసిగా ఉన్నాడు.
Thank you all ❤️https://t.co/PBZbcYh95T pic.twitter.com/DVsf8F7obw
— Sharwanand (@ImSharwanand) June 28, 2022
