Sharwanand : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా కొద్ది క్షణాల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో.. శర్వానంద్ వరుసగా పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటాడు. శర్వానంద్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి ఆ అమ్మాయిలు నచ్చకపోవడంతో......

Sharwanand : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ రిలీజ్..

Adavallu Meeku Joharlu

 

Aadavallu Meeku Joharlu :  శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఖుష్బూ, రాధికా, ఊర్వశి లాంటి సీనియర్ నటులు నటించారు. చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. పెళ్ళికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొని ఫుల్ కామెడీతో, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ ఈ సినిమా ఉండబోతుందని గతంలోనే డైరెక్టర్ తెలిపారు. ఇటీవల వచ్చిన సాంగ్స్ కి స్పందన వచ్చింది.

తాజాగా కొద్ది క్షణాల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో.. శర్వానంద్ వరుసగా పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటాడు. శర్వానంద్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి ఆ అమ్మాయిలు నచ్చకపోవడంతో శర్వానంద్ పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. ప్లాట్ ఫామ్ మీద కూడా పెళ్లి చూపులు పెడతారు. ఇందులో బ్రహ్మానందం కూడా ఉండటం విశేషం. ఇలా శర్వానంద్ పెళ్లి చూపులు చూస్తుంటే మధ్యలో రష్మిక పరిచయం అవ్వటం, తనతో కొన్ని కామెడీ సీన్స్, తనతో ప్రేమలో పడటం, పెళ్లి గురించి మాట్లాడటం, మొదట రష్మిక అసలు పెళ్లి చేసుకోను అని చెప్పటం, శర్వానంద్ రష్మికతో పెళ్లి గురించి ట్రై చేయడం.. ఇలా ట్రైలర్ ఆద్యంతో కామెడీగా సాగింది. చివర్లో నీకు, మీ ఆడాళ్లకి వస్తే బాధ.. నాకు, మా మగాళ్ళకి వస్తే కాదా.. అని రష్మికతో చెప్పడం, ఆ తర్వాత ఎమోషనల్ గా శర్వానంద్ ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడటం చూపించారు. చివర్లో సినిమాలో ఉన్న ఆడవాళ్లందరికి దండాలు పెడుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేశారు.

Supritha : అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది.. సురేఖవాణి కూతురు సుప్రీత కామెంట్స్

ట్రైలర్ చూస్తుంటేనే సినిమాలో మంచి కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. శర్వానంద్ కి గత కొన్ని రోజులుగా హిట్ సినిమా లేకపోవడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.