Supritha : అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది.. సురేఖవాణి కూతురు సుప్రీత కామెంట్స్

ఇటీవలే సుప్రీత ఒక ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వీడియో ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి...

Supritha : అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది.. సురేఖవాణి కూతురు సుప్రీత కామెంట్స్

Surekha Vani

 

Surekhavani :  టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో చాలా ఫాలోయింగ్‌ ఉంది. సురేఖ వాణి ఒకపక్క సినిమాలలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి రచ్చ చేస్తుంది. తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన కూతురితో కలిసి హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది సురేఖ వాణి.

 

ఇక తన కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటుంది సురేఖ. ఇటీవలే సుప్రీత ఒక ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ వీడియో ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లి గురించి కూడా చెప్పింది.

Nick Powell : నా యాక్షన్ సీన్స్ నచ్చి ప్రభాస్ ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చారు

సుప్రీత ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. కానీ ఏం జరుగుతుందో టైం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే పూర్తిగా సెటిల్‌ అవుతున్నాం. అమ్మ తన కెరీర్ కంటే నా కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్‌ పెడుతుంది” అని తెలిపింది. ఈ లెక్కన చూస్తే సురేఖ వాణి కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.