Sharwanand : ఇకపై శర్వానంద్ స్టార్ ట్యాగ్ అదే.. శర్వా పేరు ముందు ఏం స్టార్ వేశారో తెలుసా..?

మనమే సినిమా నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు.

Sharwanang Gets a New Star Tag Title called Charming Star Fans Happy

Sharwanand : సాధారణంగా మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుస్తారు. గతంలో స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి పేరు ముందు వేస్తున్నారు. హీరోలు స్వతహాగా ఈ స్టార్ ట్యాగ్స్ పెట్టుకోకపోయినా అభిమానులు లేదా హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పెడతారు.

తాజాగా హీరో శర్వానంద్ కి మొదటి సారి ఓ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా ఎదిగాడు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉండి మంచి మంచి సినిమాలను అందించాడు. ఇప్పుడు జూన్ 7న మనమే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ లో మనమే సినిమా నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు.

Also Read : Pithapuram : పిఠాపురంలో జరిగే మొదటి సినిమా ఈవెంట్ అదే.. క్లారిటీ ఇచ్చిన శర్వానంద్..

శర్వానంద్ కి ఛార్మింగ్ స్టార్ ఇచ్చారు. ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్ లోగో అక్కడ స్క్రీన్ పై ప్లే చేసి చూపించారు. ఇకపై శర్వానంద్ సినిమాల్లో పేరుకు ముందు ఛార్మింగ్ స్టార్ అనే స్టార్ ట్యాగ్ పడనుంది. అయితే దీనిపై శర్వానంద్ స్పందిస్తూ.. గతంలో మహానుభావుడు సినిమా టైంలో డైరెక్టర్ మారుతి ఏదో ఒక ట్యాగ్ పెట్టుకో అని చాలా పేర్లు వినిపించాడు. నేను వద్దన్నాను. మీరు ఇప్పుడు ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్యూ సర్ అని అన్నారు. దీంతో శర్వా ఫ్యాన్స్ తమ హీరోని ఇకపై ఛార్మింగ్ స్టార్ అని పిలుచుకోబోతున్నారు.