Shefali Jariwala Suspicious Death Police Question Cook
కాంటా లగా సాంగ్ ఫేమ్ ఫషాలీ జరివాలా ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గుండెపోటుతో ఆమె మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. కుటుంబ సభ్యులు దానిని ధ్రువీకరించలేదు. ఇక ముంబై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆమె అపార్ట్‌మెంట్‌లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వంట మనిషి, ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఘటన గురించి సమాచారం తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ‘అంధేరీలోని షఫాలీ నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని కుమార్ ఆస్పత్రికి తరలించాం. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.’ అని పోలీసులు చెప్పారు.
Shefali Jariwala : విషాదం.. ‘కాంటా లగా ఫేమ్’ ఫేమ్ షఫాలీ జరివాలా కన్నుమూత
శుక్రవారం రాత్రి ఫషాలీ జరివాలా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే ఆమెను భర్త పరాగ్ అంధేరిలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
2002లో వచ్చిన రీమిక్స్ సాంగ్ కాంటా లగా గర్ల్‌తో జరివాలా ఫేమస్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆమెను అంతా కాంటా లగా గర్ అని పిలుస్తూ ఉన్నారు. 2015లో నటుడు ఆమె పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. ఇది ఆమెకు రెండో వివాహం.