Shefali Jariwala : విషాదం.. ‘కాంటా లగా ఫేమ్’ ఫేమ్ షఫాలీ జరివాలా కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లాగా సాంగ్ ఫేమ్ ఫషాలీ జరివాలా కన్నుమూశారు.

Kaanta Laga fame Shefali Jariwala Passes Away At 42
బాలీవుడ్ నటి, కాంటా లాగా సాంగ్ ఫేమ్ ఫషాలీ జరివాలా కన్నుమూశారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే ఆమెను భర్త పరాగ్ అంధేరిలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Ileana : రెండో సారి తల్లి అయిన పోకిరి భామ.. ఈసారి కూడా బాబే.. పేరేంటో తెలుసా?
షఫాలీ జరివాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. 2002లో వచ్చిన వీడియో సాంగ్ ‘కాంటా లగా’తో షఫాలీ క్రేజ్‌ను సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమెను అంతా కాంటా లాగా గర్ల్ అని పిలుస్తూ ఉన్నారు.
ఆ తరువాత ఆమె సల్మాన్ ఖాన్ ‘ముజ్సే షాదీ కరోగా’ అనే ఓ సినిమాలో కీలక పాత్రలో నటించారు. పలు టీవీ రియాలిటీ షోలు చేశారు. హిందీ బిగ్‌బాస్ 13లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33లక్షల మంది పాలోవర్స్ ఉన్నారు.
ఆమె 2004లో టీవీ సీరియల్ నటుడు ప్రాగ్ త్యాగిని పెళ్లి చేసుకుంది. అయితే..2009లో వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాత 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.