Dhanush: వంద కోట్ల బడ్జెట్‌తో శేఖర్ కమ్ముల సినిమా?

శేఖర్ కమ్ముల సినిమా అంటే తెలుగు ప్రేక్షకులలో ఓ ముద్ర పడిపోయింది. సిక్స్ ప్యాక్ హీరోలు.. భారీ బడ్జెట్ హంగులు.. వయలెన్స్ ఉంటేనే సినిమా హిట్టు అనే లెక్క కాకుండా సింపుల్ గా మనకి తెలిసిన కథలా.. మన పక్కింట్లో కథలానే ఉన్నా.. అందులో కంటెంట్ ఉంటే చాలనేలా శేఖర్ కమ్ముల సినిమా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

Dhanush

Dhanush: శేఖర్ కమ్ముల సినిమా అంటే తెలుగు ప్రేక్షకులలో ఓ ముద్ర పడిపోయింది. సిక్స్ ప్యాక్ హీరోలు.. భారీ బడ్జెట్ హంగులు.. వయలెన్స్ ఉంటేనే సినిమా హిట్టు అనే లెక్క కాకుండా సింపుల్ గా మనకి తెలిసిన కథలా.. మన పక్కింట్లో కథలానే ఉన్నా.. అందులో కంటెంట్ ఉంటే చాలనేలా శేఖర్ కమ్ముల సినిమా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. హ్యాపీ డేస్ నుండి నిన్నటి ఫిదా వరకూ అలానే సాఫ్ట్ కథలను అంతే సాఫ్ట్ గా చెప్పి మెప్పించాడు. అయితే ఇప్పుడు ఏకంగా వందకు కోట్ల పైగా భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

శేఖర్ కమ్ముల త్వరలోనే తమిళ వెర్సిటైల్ హీరో ధనుష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇది ధనుష్ స్ట్రైట్ తొలి తెలుగు సినిమా. పాన్ ఇండియాగా తెరకెక్కే ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల భారీ ప్లాన్స్ లో ఉన్నాడట. ఏషియన్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండగా కథ కూడా అదే స్థాయిలో యూనిక్ గా ఉంటుందని చెప్తున్నారు. కాగా.. కథ దృష్ట్యా ఏషియన్ సంస్థ భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది.

దక్షణాది అన్ని పరిశ్రమల నుండి నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ను కూడా తీసుకోనున్న ఈ సినిమాలో లవ్ స్టోరీకి మించి ఏదో కథ ఉండనుందనే ప్రచారం జరుగుతుంది. కాగా.. శేఖర్ కమ్ముల అంటే ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసింది లేదు. కానీ వంద నుండి 120 కోట్ల టార్గెట్ తో మొదలు కానున్న ఈ సినిమాను ఏ స్థాయిలో ఉంటుందా అన్నదానిపైనే ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ సాగుతుంది.