తమిళ తంబీలను ఆకట్టుకుంటున్న శిల్పా శెట్టి వీడియో..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 05:52 AM IST
తమిళ తంబీలను ఆకట్టుకుంటున్న శిల్పా శెట్టి వీడియో..

Updated On : April 29, 2020 / 5:52 AM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులు, వర్కౌట్స్, ఫొటోలు, వీడియోలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సూర్యనమస్కారాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా చేసిన వీడియో ఒకటి తమిళ తంబీలకు బాగా నచ్చేసింది.

తమిళ స్టార్ హీరో విజయ్ ‘వాతి కమింగ్’ పాటను టిక్ టాక్ చేసింది శిల్పా. కార్తితో ‘ఖైదీ’ తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రం తెరకెక్కింది. లాక్‌డౌన్  కారణంగా రిలీజ్ వాయిదా పడింది.

ఈ మూవీలో అనిరుధ్ కంపోజ్ చేసిన ‘Vaathi Coming’ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ పాటకు శిల్పా శెట్టి సూపర్బ్ స్టెప్స్ వేసింది. తమ అభిమాన హీరో పాటకు శిల్పా అదిరిపోయే మూమెంట్స్ చేయడంతో ఈ వీడియోను విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.