The Warrior : రామ్ కోసం శింబు.. ఏంటా స్పెషల్ అప్డేట్??
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక దాని తర్వాత తెలుగు తమిళ్ భాషల్లో ''ది వారియర్'' అనే సినిమాని చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్............
- Saketh U
- Published On : April 17, 2022 / 01:28 PM IST
Rapo
Ram : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక దాని తర్వాత తెలుగు తమిళ్ భాషల్లో ”ది వారియర్” అనే సినిమాని చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రామ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ది వారియర్ రూపొందబడుతుంది. అంతే కాక రామ్ మొట్టమొదటి సారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆది పినిశెట్టి విలన్ గా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి త్వరలో అప్డేట్ ఉండబోతుందని ప్రకటించారు.
Acharya : ఆచార్యలో చరణ్, కాజల్ లెంగ్త్‌కి కత్తెర పడనుందా??
ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో శింబుని తీసుకొచ్చారు. శింబు, రామ్, డైరెక్టర్, చిత్ర యూనిట్ ఉన్న ఫోటోని రిలీజ్ చేసి వారియర్ కోసం శింబు అంటూ పోస్ట్ చేశారు. అయితే శింబు ఈ సినిమాకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు అని అంతా ఆలోచిస్తున్నారు. గతంలో శింబు తెలుగు సినిమాలకి సాంగ్స్ పాడి ప్రమోట్ కూడా చేశారు. ఇదే నేపథ్యంలో తమిళ్ లో కూడా ఈ సినిమా ప్రమోట్ అవ్వడానికి శింబుని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాలో శింబు ఓ పాట పాడనున్నారు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
It’s #STRforRAPO ?!
Stay tuned for something mind blowing coming your way#TheWarriorr ⚔️@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @srinivasaaoffl @iAksharaGowda @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/9rxBYwTVxg
— Ramesh Bala (@rameshlaus) April 17, 2022
