Acharya : ఆచార్యలో చరణ్, కాజల్ లెంగ్త్‌కి కత్తెర పడనుందా??

ఆచార్యలో చరణ్ దాదాపు 40 నిమిషాల పాటు కనపడనున్నాడు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్, ఆచార్య ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన కామెంట్స్ విని కొరటాల శివ చరణ్ క్యారెక్టర్ ని కాస్త తగ్గిస్తే........

Acharya : ఆచార్యలో చరణ్, కాజల్ లెంగ్త్‌కి కత్తెర పడనుందా??

Acharya (1)

Acharya :  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో కాజల్, పూజాహెగ్డేలు కథానాయికలుగా నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించాయి. అయితే ఆచార్య ట్రైలర్ లో చరణ్ పాత్రకి ఎక్కువ ఇంపార్టంట్ ఉన్నట్టు చూపించారు. అంతే కాక కాజల్ అగర్వాల్ ఒక్క సీన్ లో కూడా కనపడలేదు.

 

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్టీస్టారర్ అని ఎన్టీఆర్, చరణ్ లకి ఇద్దరికీ సమానంగా స్కోప్ ఉంటుందని అన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఇద్దరి నటన సమానంగా ఉన్నా పాత్ర నిడివి మాత్రం చరణ్ కి ఎక్కువసేపు ఉందని ఆరోపించారు. ఆచార్య ట్రైలర్ చూసిన తర్వాత కూడా కొంతమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమా అని చెప్పి చరణ్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వనున్నారా అని భావిస్తున్నారు. దీంతో డైరెక్టర్ కొరటాల శివ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో చరణ్ పాత్రని కొద్దిగా తగ్గించాలని భావిస్తున్నారని సమాచారం.

Madhavan : మరోసారి దేశానికి పతకం తెచ్చిన మాధవన్ తనయుడు..

ఆచార్యలో చరణ్ దాదాపు 40 నిమిషాల పాటు కనపడనున్నాడు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్, ఆచార్య ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన కామెంట్స్ విని కొరటాల శివ చరణ్ క్యారెక్టర్ ని కాస్త తగ్గిస్తే మంచిదని భావించి మళ్ళీ ఎడిటింగ్ చేయిస్తున్నారట. చరణ్ క్యారెక్టర్ ముందు అనుకున్న దానికంటే కొద్దిగా తగ్గించనున్నట్టు తెలుస్తుంది. అలాగే హీరోయిన్ కాజల్ రోల్ ను కూడా తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఇలాంటి టైంలో కాజల్ ప్రమోషన్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. అంతే కాక సోషల్ మీడియాలో కూడా ఆచార్య గురించి ఎలాంటి పోస్టులు పెట్టట్లేదు కాజల్. దీంతో కాజల్ క్యారెక్టర్ ని కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎవరెవరు ఎంతసేపు కనపడతారో తెలియాలంటే 29 వరకు ఆగాల్సిందే.