Madhavan : మరోసారి దేశానికి పతకం తెచ్చిన మాధవన్ తనయుడు..

ధవన్ తనయుడు వేదాంత్ మంచి స్విమ్మర్. ఇప్పటికే స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్‌ భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చాడు. ప్రతి స్విమ్మింగ్ పోటీల్లోని వేదాంత్ కచ్చితంగా పతకం.............

Madhavan : మరోసారి దేశానికి పతకం తెచ్చిన మాధవన్ తనయుడు..

Madhavan

 

Vedant :  ఒకప్పుడు ప్రేమకథలతో అందర్నీ మెప్పించిన హీరో మాధవన్ ప్రస్తుతం హీరోతో పాటు స్పెషల్ క్యారెక్టర్ గా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇక మాధవన్ తనయుడు వేదాంత్ మంచి స్విమ్మర్. ఇప్పటికే స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్‌ భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చాడు. ప్రతి స్విమ్మింగ్ పోటీల్లోని వేదాంత్ కచ్చితంగా పతకం తీసుకొచ్చి తన తల్లి తండ్రులతో పాటు దేశం కూడా గర్వపడేలా చేస్తాడు. చాలా సార్లు వేదాంత్ పై మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఇక నెటిజన్లు వేదాంత్ ని సెలబ్రిటీ పిల్లలు అంటే నీలా ఉండాలి అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.

 

తాజాగా వేదాంత్ దేశానికి మరో పతకం తీసుకొచ్చాడు. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్‌ కొడుకు వేదాంత్‌ రజత పతకం సాధించాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ పోటీలలో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ ఈ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అలాగే బంగారు పతకం సాధించిన సాజన్ ప్రకాష్ ని కూడా అభినందించారు.

Vishwak Sen : మెగాస్టార్‌తో పోటీకి సై అంటున్న యువ హీరో

స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విన్నర్స్ వివరాలని పోస్ట్ చేయగా, మాధవన్ దాన్ని షేర్ చేస్తూ.. ”మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల డానిష్ ఓపెన్ లో సాజన్, వేదాంత్ ఇద్దరూ బంగారు, వెండి పతకాలని సాధించారు. ఇందుకు ఎంతగానో సహకరించిన కోచ్ ప్రదీప్ గారికి, స్విమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి, ఆక్వా స్పోర్ట్స్ నేషన్ అకాడమీకి ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు.