Shiva Karthikeyan : సింహాన్ని పెంచుకోబోతున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్.. లిస్ట్‌లో ఇది రెండో సింహం!

తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఆరు నెలలు పాటు సింహాన్ని పెంచుకోబోతున్నాడు. గతంలో కూడా ఒక సింహాన్ని ఇలానే..

Shiva Karthikeyan adopt 3 years lion from Vandalur Arignar Anna Zoological Park

Shiva Karthikeyan : తమిళ్ హీరో శివ కార్తికేయన్ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు తమిళంతో తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెల్ఫ్ మెడ్ స్టార్ అనే ట్యాగ్ ని అందుకున్నాడు. అయితే ఈ హీరో గురించి కొందరి ఆడియన్స్ కి తెలియని విషయం ఏంటంటే.. శివ కార్తికేయన్ జంతు ప్రేమికుడు. జంతువులు పై, వాటి సంరక్షణ పై ఎంతో కరుణ చూపిస్తుంటాడు. ఇప్పటికే ఈ హీరో పలు జంతువులను దత్తత తీసుకోని వాటిని చూసుకుంటూ వస్తున్నాడు.

Bigg Boss : మొన్న తప్పుగా తాకడని మందలించింది.. ఇప్పుడు ఏకంగా 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే 2021 లో ‘ప్రకృతి’ అనే ఏనుగును, ‘విష్ణు’ అనే సింహాన్ని ఆరు నెలలు పాటు దత్తత తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు మరో సింహాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. తమిళనాడులోని వండలూరు అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఉన్న ‘షేరు’ అనే సింహాన్ని దత్తత తీసుకున్నాడు. మూడేళ్ళ వయసు ఉన్న ఈ సింహం బాధ్యతను ఆరు నెలల వరకు శివ కార్తికేయన్ చేసుకోనున్నాడు. ఇక ఈ విషయం బయటకి తెలియడంతో.. జంతువులు పై శివ కార్తికేయన్ చూపిస్తున్న ప్రేమకి హ్యాట్సఫ్ అంటున్నారు.

Balakrishna : మా జీవనం కోసం కాదు.. ఇండస్ట్రీ బ్రతకడం కోసం నటిస్తున్నాము.. సీనియర్ హీరోల గురించి బాలయ్య కామెంట్స్!

ఇక ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో మావీరన్, అయాలాన్ సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాయి. ఎలియాన్ కథాంశంతో అయాలాన్ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా మూవీ పై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అలాగే కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. దీంతో ఈ మూవీ పై తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్యూరియాసిటీ ఎర్పడింది.