Shiva Kartikeyan : రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ.. అగ్ర నిర్మాతపై స్టార్ హీరో కేసు..

జ్ఞానవేల్ రాజా, శివకార్తికేయన్ ఇద్దరు 2018 జూలై 6న మిస్టర్ లోకల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ సినిమా విషయంలో నిర్మాత తనకు రెమ్యునరేషన్ బాకీ ఉన్నారని.........

New Project

 

Shiva Kartikeyan :  తమిళ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న స్టూడియో గ్రీన్ ఫిలింస్ అధినేత జ్ఞానవేల్ రాజా. ఈయనపై తాజాగా తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కేసు నమోదు చేశారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ లో శివకార్తికేయన్ మిస్టర్ లోకల్ అనే సినిమా చేశారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని 2019లో విడుదల అవ్వగా అంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా విషయంలో నిర్మాత తనకు రెమ్యునరేషన్ బాకీ ఉన్నారని శివ కార్తికేయన్ కోర్టులో కేసు వేశారు.

 

జ్ఞానవేల్ రాజా, శివకార్తికేయన్ ఇద్దరు 2018 జూలై 6న మిస్టర్ లోకల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమా మొత్తానికి హీరోకి 15 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పారు. అడ్వాన్స్ గా ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆ తర్వాత 10 కోట్లను ఇచ్చారు. మొత్తం 11 కోట్లు ఇవ్వగా మిగిలిన నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అంతే కాకుండా దీనికి ట్యాక్స్ నిర్మాత కట్టకపోవడంతో 91 లక్షల ట్యాక్ శివ కార్తికేయన్ కట్టాల్సి వచ్చింది. దీంతో ఈ అంశాలన్నీ పరిగనణలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలని శివకార్తికేయన్ కోరారు.

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డ్యాన్స్ వేసిన కేంద్ర మంత్రి

అంతేకాక తనకు రావాల్సిన 4 కోట్ల రెమ్యూనరేషన్ ఆగిపోయిందని, అది తనకు వచ్చే వరకు ఆ నిర్మాణ సంస్థలో వస్తున్న సినిమాలేవీ విడుదల కాకుండా చూడాలి అని, స్టూడియో గ్రీన్ సంస్థలో ప్రస్తుతం రెబల్, విక్రమ్ 61వ సినిమా, పత్తు తలా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తన బాకీ ఇచ్చేంత వరకు ఈ మూడు సినిమాలకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏవీ అమ్మకూడదని తాను వేసిన పిటిషన్ లో కోర్టుకు తెలియజేసాడు శివకార్తికేయన్. శివ కార్తికేయన్ తరపున జస్టిస్ యం సుందర్ ఈ కేసు ఫైల్ చేశారు. ఈ కేసుని మద్రాస్ హైకోర్టులో వేశారు. దీనికి సంబంధించిన మొదటి విచారణ మార్చి 31న జరగనుంది. మరి కేసు ఎవరివైపుకి తిరుగుతుందో, శివ కార్తికేయన్ కి డబ్బులు ఇస్తారో లేదో, కేసు తొందరగా అవుతుందో, సాగుతుందో చూడాలి.