Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ గ్లింప్స్ రిలీజ్.. కేరళ అందాలతో..

'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' నుంచి ఓ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ రాబోతుంది. 'నరుడి బ్రతుకు నటన' గ్లింప్స్ రిలీజ్.

Shiva Kumar Ramachandravarapu Narudi Brathuku Natana movie glimpse released

Narudi Brathuku Natana : టాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ఒక పక్క బడా హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క చిన్న చిత్రాలను, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను కూడా రూపొందిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తుంది. ఈక్రమంలోనే ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను తీసుకురాబోతుంది. రిషికేశ్వర్ యోగి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శివ కుమార్ రామచంద్రవరపు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో అవమానాలు ఎదుర్కొంటున్న ఒక నటుడి గురించి చెబుతున్నట్లు కనిపిస్తుంది. నీకు యాక్టింగ్ రాదంటూ హీరోని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తుంటే.. ఆ నటుడిని బయటకి తీసుకు రావడం కోసం చేసిన ప్రయాణమే ఈ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని కేరళ అందాలతో అద్భుతంగా చూపించబోతున్నారు.

Also read : RGV : నెపోటిజం చంపేద్దాం.. అవార్డ్స్ అన్ని ఫేక్.. ‘యువర్ ఫిల్మ్’ అంటూ ఆర్జీవీ కొత్త కాన్సెప్ట్..

ఒక చిన్న గ్లింప్స్ లోనే నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ని చూపించేసారు. నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి, వివేక్ కూఛిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.