Shiva Puneeth
Puneeth Rajkumar : బెంగళూరు కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్యియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం 4.30 గంటలకే… స్టేడియం నుంచి స్టూడియోలో ఖననం స్థలానికి పునీత్ పార్థివదేహం తీసుకొచ్చారు. స్టేడియంలో అభిమానుల కడసారి చూపులకు నిన్నంతా సమయం ఇవ్వడంతో.. ఇవాళ ఉదయాన్నే అంత్యక్రియలు పూర్తిచేయాలని నిర్ణయించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. సీఎం బొమ్మై సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Read This : Puneeth Rajkumar: చివరి చూపు కోసం 5లక్షల మంది అభిమానులు.. నలుగురు మృతి
తమ్ముడి ఖననం సందర్భంగా అన్న శివరాజ్ కుమార్ భోరుమని ఏడ్చాడు. ఆయన్ను ఓదార్చేందుకు సన్నిహితులు ప్రయత్నించారు. తమ్ముడి పార్థివదేహం దగ్గరే కంటతడి పెడుతున్న శివరాజ్ కుమార్ ను చూసి.. చాలామంది కళ్లు చెమ్మగిల్లాయి.