Puneeth Rajkumar: చివరి చూపు కోసం 5లక్షల మంది అభిమానులు.. నలుగురు మృతి
అనతి కాలంలో పవర్‌స్టార్‌గా ఎదిగి కన్నడీగుల ప్రతీ ఇంట్లో మనిషిగా అనిపించి, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో పునీత్ రాజ్‌కుమార్.

Punith Raj Kumar (1)
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజన్న కొడుకుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలో పవర్‌స్టార్‌గా ఎదిగి కన్నడీగుల ప్రతీ ఇంట్లో మనిషిగా అనిపించి, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో పునీత్ రాజ్‌కుమార్. పునీత్ చివరిచూపు కోసం కర్నాటక వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఐదు లక్షల మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
అప్పూ.. అప్పూ అంటూ ఆర్తనాదాలు చేస్తూ.. ‘రాజకుమార’ అంటూ నినాదాలు చేస్తూ, రోదనలు, కన్నీళ్లు మధ్య పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, నటీనటులు కూడా వచ్చి పునీత్ రాజ్‌కుమార్‌కు వీడ్కోలు పలికారు. కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబంలోని సభ్యులు ఇంట్లో వంట చేయరు.. తినరు.. కానీ, పునీత్ చనిపోయిన తర్వాత.. లక్షలాది మంది ఇళ్లలో పొయ్యి వెలగలేదని అభిమానులు చెబుతున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన అభిమానులు లక్షలాదిగా తరలివస్తుండడంతో బెంగళూరులోని పలు సంఘాలు వారికి రోడ్డుపైనే భోజనాలను ఏర్పాటు చేశారు. అయితే, కంఠీరవ స్టేడియంలో జనాలను అదుపు చెయ్యలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేశారు.
నలుగురు అభిమానుల మృతి:
పునీత్ మృతిని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా నలుగురు అభిమానులు మృతి చెందారు.