Shobha Shetty came out of the Bigg Boss house With health problem
Shobha Shetty : బుల్లితెర నటి, బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి గురించి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో భారీ గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగు బిగ్ బాస్ కి కూడా వెళ్ళింది. బిగ్ బాస్ అనంతరం మళ్ళీ సీరియల్స్ తో బిజీగా మారుతున్న సమయంలో కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళింది. ఇక ఈ బిగ్ బాస్ లో కూడా తన టాలెంట్ తో ముందుకు వెళుతుంది అనుకున్నారు ఆడియన్స్. కానీ ఊహించని విధంగా బయటికి వచ్చేసింది.
Also Read : Pushpa 2 : ‘పుష్ప మూవీకి అసలు ప్రమోషన్ అవసరం లేదు’.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే తాజాగా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేసినట్టు ఓ పోస్ట్ షేర్ చేసింది ఈ బ్యూటీ.” నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. ఆటపై దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు, ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నా శరీరం సహకరించడం లేదు.. నేను ఎవరినీ, దేన్నీ తేలిగ్గా తీసుకోలేదు, జీవిత బాధ్యతల కోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నింటిలో మీరు నాకు చూపిన ప్రేమ, సపోర్ట్ కి నేను థాంక్స్ తెలుపుతున్నాను. నేను తెలిసి, తెలియక ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా ఆడియన్స్ కు, కలర్స్ కన్నడ టీమ్‌కి, నా ప్రియమైన కిచ్చా సుదీప్ సర్‌కి థాంక్స్. మీ ప్రేమను తిరిగి పొందడానికి, మిమ్మల్ని అలరించేందుకు త్వరలోనే మీ ముందుకు వస్తాను’ అని తెలిపింది. దీంతో నటి శోభా శెట్టి పోస్ట్ వైరల్ అవుతుంది.
తన ఆరోగ్యం బాలేకపోవడం కారణంతో శోభా బయటికి వచ్చింది. షోలో ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని తెలిపింది. మళ్ళీ తిరిగి శోభా సీరియల్స్ స్టార్ట్ చేస్తుందా లేక తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి సీరియల్స్ కి బ్రేక్ ఇస్తుందా చూడాలి.