Pushpa 2 : ‘పుష్ప మేకింగ్ గ్లింప్స్’.. మీతో నడవడం గౌరవంగా ఉంది.. సుక్కుపై భార్య ఎమోషనల్ పోస్ట్..
పుష్ప 2 విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది.

Director Sukumar wife Tabitha Sukumar shared pushpa 2 movie Making Glimpses
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 విడుదలకి రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి రష్మిక, బన్నీ, సుకుమార్, అనసూయ, శ్రీలీలతో పాటు మూవీ టీమ్ అందరూ హాజరయ్యారు .
అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది. పుష్ప మేకింగ్ గ్లింప్స్ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో పుష్ప కోసం సుక్కు, అల్లు అర్జున్ తో పాటు మూవీ టీమ్ ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ఆ వీడియో కి ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించింది తబిత.” పుష్ప రైడ్ కేవలం ఆసక్తికరమైంది మాత్రమే కాదు. ఎంతో ఎమోషనల్ కూడా. ఇంట్లో కూర్చోని స్క్రిప్ట్స్ చదివే దగ్గర నుండి పెద్ద స్టేజ్ పై నిలబడి ప్రశంసలు అందుకునే వరకు మీ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచమంత మీలోని ప్రతిభను చూస్తుంది. మీ సక్సెస్ లో మీ పక్కన ఉన్నందుకు గర్వంగా ఉంది. మీతో కలిసి నడుస్తునందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ సృష్టించడానికి ఇంకా ఎన్నో కథలున్నాయి” అంటూ పేర్కొంది.
View this post on Instagram
తన భర్త కష్టాన్ని, పుష్ప మేకింగ్ ని, ఆయన సక్సెస్ గురించి సుక్కు భార్య చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.