Allu Arjun : స్టేజి మీదకు దూసుకొచ్చిన అభిమాని.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా.. పిలిచి ఫోటో ఇచ్చిన బన్నీ..
ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఓ అభిమాని వేగంగా స్టేజిపైకి దూసుకొచ్చాడు.

Allu Arjun Fan forcefully Coming on to Stage Request Photo with Bunny Video goes Viral
Allu Arjun : పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేసారు. తాజాగా నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఓ అభిమాని వేగంగా స్టేజిపైకి దూసుకొచ్చాడు.
వెంటనే అక్కడున్న బౌన్సర్లు గమనించి ఆ అభిమానిని పక్కకి లాగేస్తుండగా అతను అన్న ఒక్క ఫోటో అన్న అని అరుస్తుండటంతో బన్నీ బౌన్సర్లు ని వదిలేయమని చెప్పి అతన్ని పిలిచి ఫోటో ఇచ్చాడు. దీంతో అతను సంతోషంగా జై బన్నీ అంటూ వెళ్ళాడు.
ఈ సంఘటనతో బన్నీ మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా. నా ఫ్యాన్స్, నా ఆర్మీ లవ్ యు అంటూ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. కానీ ఇలాంటివి మాత్రం చేయకండి అని అన్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.