Sukumar – Allu Arjun : సుకుమార్ మాటలకు అల్లు అర్జున్ కన్నీళ్లు.. ఎమోషనల్ అయిన సుక్కు.. కథ లేకపోయినా సినిమా ఓకే చేసి..

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ..

Sukumar – Allu Arjun : సుకుమార్ మాటలకు అల్లు అర్జున్ కన్నీళ్లు.. ఎమోషనల్ అయిన సుక్కు.. కథ లేకపోయినా సినిమా ఓకే చేసి..

Sukumar Speech in Pushpa 2 Movie Pre Release event

Updated On : December 2, 2024 / 11:47 PM IST

Sukumar – Allu Arjun : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బన్నీకి ఉన్న ఒక బాండింగ్ మాత్రమే కారణం. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర కథ కూడా పూర్తిగా లేదు. నీకు కేవలం క్యారెక్టర్ గురించి, కొన్ని సీన్స్ గురించి చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు. లవ్ యు బన్నీ. అందరూ చెప్పినట్లు బన్నీ సెట్స్ లో అందర్నీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఇంక నేను ఎక్కువ మాట్లాడితే అంటూ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బన్నీకి కూడా కన్నీళ్లు వచ్చాయి.

అలాగే సుకుమార్.. రష్మిక గురించి, శ్రీలీల గురించి, నిర్మాతల గురించి, టెక్నిషియన్స్ గురించి మాట్లాడుతూ అందరికి థ్యాంక్స్ తెలిపారు.

Also Read : Allu Aravind : మగధీర ముందు.. మళ్ళీ ఇప్పుడు.. అల్లు అరవింద్ పుష్ప 2 చూశాక ఆయన భార్య కామెంట్స్..