Allu Aravind : మగధీర ముందు.. మళ్ళీ ఇప్పుడు.. అల్లు అరవింద్ పుష్ప 2 చూశాక ఆయన భార్య కామెంట్స్..
పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ..

Allu Aravind Speech in Pushpa 2 Movie Pre Release Event
Allu Aravind : నేడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ తండ్రి, స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా వచ్చారు..
పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఒక వారం రోజుల క్రితం నేను పుష్ప 2 సినిమా చూసాను. సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఎందుకు మొహం ఇంత వెలిగిపోతుంది. మగధీర సినిమా అప్పుడు మీ మొహం ఎంత వెలిగిపోవడం చూశాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతా ఆనందంగా ఉన్నాను. అల్లు అర్జున్ భార్య స్నేహ, సుకుమార్ భార్య బబితకు అవార్డులు అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే 5 ఏళ్ళ పాటు సపోర్ట్ చేసినందుకు. ఈ సినిమాలో రష్మిక నటనతో పోలిస్తే పుష్ప 1 సినిమాలో చాలా తక్కువ అని చెప్పొచ్చు. శ్రీలీల కనిపించేది తక్కువ సేపే అయినా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ నాకు తన చిన్నప్పట్నుంచి తెలుసు. తను ఇంత మంచి హిట్స్ కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఒక నిర్మాతగా నేను చెప్తున్నాను మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే అతిపెద్ద నిర్మాతలు. వాళ్ళు ఇన్ని సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడా ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని అన్నారు.