బిగ్ బాస్ కోసం భారీ డిమాండ్

బిగ్ బాస్ 3 కి హోస్ట్‌గా చేస్తున్నందుకు గానూ, ఎన్టీఆర్‌కి అక్షరాలా రూ.20 కోట్ల భారీ పారితోషికం కూడా ముట్టజెప్పనున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది.

  • Publish Date - February 2, 2019 / 07:46 AM IST

బిగ్ బాస్ 3 కి హోస్ట్‌గా చేస్తున్నందుకు గానూ, ఎన్టీఆర్‌కి అక్షరాలా రూ.20 కోట్ల భారీ పారితోషికం కూడా ముట్టజెప్పనున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వంటి వరస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌తో స్మాల్ స్ర్కీన్‌పై కూడా తన సత్తా చాటాడు. చక్కటి వాక్చాతుర్యంతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఫస్ట్ సీజన్‌తో కంపేర్ చేస్తే, సెకండ్ సీజన్ అంతగా క్లిక్ అవలేదు. కట్ చేస్తే, సీజన్ 3 కి మళ్ళీ, తారక్‌ని రంగంలోకి దింపడానికి స్టార్ మా చాలా కష్ట పడుతుంది. రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం డేట్స్ అన్నీ ఇచ్చేసిన ఎన్టీఆర్, బిగ్ బాస్ 3 చెయ్యడానికి మొదట్లో ఇంట్రెస్ట్ చూపించకపోయినా, స్టార్ మా యాజమాన్యం రాజమౌళితో మాట్లాడి ఒప్పించారని తెలుస్తుంది.

బిగ్ బాస్ 3 కి హోస్ట్‌గా చేస్తున్నందుకు గానూ, ఎన్టీఆర్‌కి అక్షరాలా రూ.20 కోట్ల భారీ పారితోషికం కూడా ముట్టజెప్పనున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది. రూ.20 కోట్లంటే, తారక్ ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్.. టెలివిజన్ హిస్టరీలో ఒక రియాలిటీ షోకి అంత మొత్తం ఇవ్వడం రికార్డనే చెప్పాలి. దాదాపు 100 రోజులపాటు సాగే బిగ్ బాస్ సీజన్ 3 కోసం అంత మొత్తం ఇవ్వడానికి రెఢీ అయ్యారంటే, యంగ్ టైగర్ క్రేజ్  ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కి తారక్ దాదాపు రూ.14 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.