విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌కి ఎంత తీసుకుంటాడో తెలుసా?

  • Publish Date - October 24, 2020 / 12:49 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండగా.. గత ఐపీఎల్‌లతో పోలిస్తే మెరుగ్గా టైటిల్ రేసులో పోటీ పడుతున్నాడు. క్రికెట్‌లో రికార్డులు క్రియేట్ చెయ్యడంలో ముందు వరుసలో ఉండే కోహ్లీ.. సోషల్ మీడియా దిగ్గజాల్లో కూడా రికార్డు ఫాలోయింగ్‌తో రాణిస్తున్నాడు.



సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫాం(ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్)లో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రమ్‌లో 81.8మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అయితే ఫాలోవర్ల సంఖ్యే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్/ట్విట్టర్‌ల ద్వారా కూడా కోహ్లీకి కాసుల వర్షం కురుస్తుంది. విరాట్ ఒక్కొక్క పెయిడ్ పోస్ట్‌ చేసినందుకు ఓ నివేదిక ప్రకారం అతను రూ .1.2 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.


ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం మరియు ట్విట్టర్‌లో ట్వీట్‌కు రూ .2.5 కోట్లు కోహ్లాకి ముట్టుతున్నాయట. ప్రస్తుతం కోహ్లీకి 38.6M ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ఒక్కడే కాదు.. చాలా మంది క్రికెటర్లు అలా సంపాదిస్తున్నారట.



ఈ క్రమంలోనే ప్రముఖ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఆదాయాలను కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రమోషనల్ పోస్ట్‌ ద్వారా ప్రియాంక చోప్రా రూ .1.85 కోట్లు సంపాదిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 58 మిలియన్లకు పైగా ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఈ సంఖ్యలు చూస్తుంటే వెర్రెక్కిపోతుంది కదా? పాపులారిటీకి ఉన్న డిమాండ్ అటువంటిది మరి! కొంతమంది అయితే ఒక సినిమా మొత్తం చేసినా అంత రెమ్యునరేషన్ దక్కించుకోలేరు.

ట్రెండింగ్ వార్తలు