Shraddha Kapoor's birthday fans surrounded Shraddha's car at her home
Shraddha Kapoor : సినిమా సెలబ్రిటీల పుట్టిన రోజు అయితే అభిమానులు సోషల్ మీడియాలో, బయట ఎంత రచ్చ చేస్తారో అందరికి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ పుట్టిన రోజు అయితే కొంతమంది అభిమానులు వాళ్ళకు విషెష్ చెప్పడానికి ఇంటిముందు పడిగాపులు కాస్తారు. అలాగే మార్చ్ 3న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టిన రోజు కావడంతో అనేకమంది అభిమానులు ముంబైలోని ఆమె నివాసానికి చేరుకున్నారు.
Manchu Manoj Wedding : మంచు మనోజ్ వెడ్డింగ్ గ్యాలరీ..
మొదట కొంతమంది అభిమానులతో శ్రద్దా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం బయటకు వెళ్తుంటే ఆమె కార్ ని చాలా మంది అభిమానులు చుట్టుముట్టడంతో కార్ లోంచి బయటకు కనపడేలా నించొని అందరికి అభివాదం చేసింది. కొంతమందికి సెల్ఫీలు ఇచ్చింది. అభిమానులు ఇచ్చిన గిఫ్ట్స్ ని తీసుకోండి. ఓ అభిమాని అయితే తన చిన్న పిల్లాడిని ఎత్తుకోమని, ఒక్క ఫోటో ఇమ్మని పిల్లాడిని పైకి ఇస్తుండటంతో శ్రద్దా.. పిల్లలతో జాగ్రత్త అంటూ అతన్ని వారించింది. మొత్తానికి శ్రద్దా ఇంటిముందున్న అభిమానులను దాటుకొని వెళ్ళడానికి చాలా సమయమే పట్టింది. ఇక పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా కపూర్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
#HappyBirthdayShraddhaKapoor #ShraddhaKapoor https://t.co/7O1LKA6uCq pic.twitter.com/NaNzi74eRS
— Happy Birthday Shruddhie? (@Shraddhas_nahid) March 3, 2023