Shrimad Bhagavatam : కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం.. రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు..

‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా (Shrimad Bhagavatam) రూపుదిద్దుకుంటోంది.

Shrimad Bhagavatam Part I Unveiled by Sagar Pictures Entertainment

Shrimad Bhagavatam : భార‌తీయుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన పురాణ గాథ‌ల‌కు సాగ‌ర్ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మ‌రోసారి స‌రికొత్త రూపం ఇవ్వ‌బోతుంది. రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక‌ప్పుడు ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించింది సాగ‌ర్ కుటుంబం. ఇక ఇప్పుడు వెండితెరపై అదే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనున్నారు. వాస్త‌వం చెప్పాలంటే.. శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. అనేక పాత్రలు, కథలు, ఆధ్యాత్మిక భావనలు, భక్తి సంప్రదాయాలు ఇందులో అంతర్లీనంగా ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే. ఇంతటి విస్తారమైన కథను ఒకే మూవీగా చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మైన ప‌నే. ఈ క్ర‌మంలోనే ఏడు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Avengers Endgame Encore : మార్వెల్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ బుకింగ్స్ ఓపెన్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు.