Avengers Endgame Encore : మార్వెల్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ – ఎన్కోర్ బుకింగ్స్ ఓపెన్
'అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ (Avengers Endgame Encore) సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Avengers Endgame Encore movie ticket bookings open
Avengers Endgame Encore : ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మార్వెల్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందింది.

ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సారి ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని ఆస్వాదించనున్నారు. ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Karuunaa Bhushan : ఏ దేశపు యువరాణివో.. అందంతో కవ్విస్తున్న కరుణ భూషణ్.. ఫోటోలు..
ఇదిలా ఉంటే.. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను కూడా చూపించనున్నట్లు సమాచారం. డూమ్స్ డే మూవీ 2026 డిసెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.
