Shruti Haasan : హీరోయిన్ శృతి హాసన్ వెంట బాడీగార్డ్స్ ఎందుకు ఉండరో తెలుసా..?
దాదాపుగా అందరు నటుల వెంట బాడీగార్డ్స్ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. హీరోయిన్ శృతిహాసన్ వెంట మాత్రం ఉండరు.
- Thota Vamshi Kumar
- Published On : September 21, 2023 / 04:17 PM IST
Shruti Haasan
Actress Shruti Haasan : మన దేశంలో సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. వారు ఎక్కడి వెళ్లినా సరే అభిమానులు వారితో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు వారి చుట్టూ గుమిగూడుతుంటారు. అందుకనే సెలబ్రిటీలు బయటకు వెళ్లే సందర్భాల్లో తమ వెంట బాడీగార్డ్స్‌ను పెట్టుకుంటుంటారు. బాలీవుడ్ యాక్టర్స్ నుంచి టాలీవుడ్ యాక్టర్స్ వరకు దాదాపుగా అందరు నటుల వెంట బాడీగార్డ్స్ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) వెంట మాత్రం ఉండరు. ఎందుకనే విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది.
శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఆమె నడుచుకుంటూ వస్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. కారు ఎక్కే వరకు ఫాలో అయ్యాడు. దీంతో భయపడిన శృతిహాసన్ అతడిని ఎవరు నువ్వు అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా శృతిహాసన్ ఈ ఘటనపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌ను శృతిహాసన్ నిర్వహించింది. ఈ ఘటన గురించి ఓ నెటీజన్ ప్రశ్నించాడు. ‘మీరు ఈ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అతడు ఎవరో నాకు తెలియదు.’ అని శృతిహాసన్ చెప్పింది.
Shruti Haasan : ముంబై ఎయిర్‌పోర్టులో శృతిహాసన్‌ని భయపెట్టిన అభిమాని.. వీడియో వైరల్
‘నేను నడుచుకుంటూ వెలుతుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. కాగా..అతడు ఫోటో కోసం వస్తున్నాడు అని అనుకున్నాను. ఇంతలో ఫోటోగ్రాఫర్లలో ఒకరు అతడిని నా పక్కన నిలుచోమని చెప్పారు. దీంతో ఆ ఫోటోగ్రాఫర్, ఇతను స్నేహితులు ఏమోనని అనుకున్నా. అయితే.. అతడు నాకు మరింత దగ్గరగా రావడంతో నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి వెళ్లిపోయా.’ అని శృతిహాసన్ చెప్పింది.
ఇక తనకు బాడీగార్డ్స్‌ను పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు అని శృతిహాసన్ తెలిపింది. స్వేచ్చగా జీవించాలని అనుకుంటాను. అందుకే ఇప్పటి వరకు బాడీగార్డ్స్‌ను పెట్టుకోలేదని తెలిపింది. అయితే.. ఇప్పుడు దీనిపై ఆలోచించాలేమోనని అంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో శృతిహాసన్ నటిస్తోంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం రావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ టీం వార్నింగ్ నోట్.. ఇక నుంచి అలా చేస్తే..
